Chiranjeevi Family: మెగా అభిమానులు కొన్నాళ్లుగా ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రామ్ చరణ్- ఉపాసనలు పెళ్లి చేసుకొని 11ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ పిల్లలకు జన్మనివ్వకపోవడంతో అభిమానులు, మీడియా సంస్థలు వారిని పదే పదే ప్రశ్నించారు. ఎట్టకేలకు జూన్ 20 ఉదయం ఉపాసన పండంటి పాపకి జన్మనిచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసనకి డెలివరీ అయింది. తల్లితో పాటు పుట్టిన పాపాయి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మెగా ఇంట శుభవార్త బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు పిలుపునిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుం
ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తమ 11వ యానివర్సరీ జరుపుకున్నారు. ఇక ఈ రోజు ఆషాఢ మాసం శుక్ల విదియ.. పునర్వసు నక్షత్రం .. కావడంతో ఎలాంటి దోష కారి కాదు. అందుకే రామ్ చరణ్ దంపతులు.. జూన్ 20న డాక్టర్ల సలహా మేరకు తమ కొత్త బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్‌కి ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఓ చిత్రం చేయనున్నారు.