Ram Charan: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. వీరి వివాహం జరిగి దాదాపు 11 ఏళ్లు అవుతున్నా కూడా ఇద్దరు చాలా అన్యన్యంగా ఉంటున్నారు. ఒకరంటే ఒకరు ఎంతో ఇష్టంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. వీరికి జూన్ 20న పండంటి ఆడబిడ్డ జన్మించగా, ఇప్పుడు ఆ చిన్నారిని చూసి చాలా మురిసిపోతున్నారు. బిడ్డ పుట్టాక తన జీవితంలో చాలా చేంజ్ వచ్చిందని ఉపాసన పేర్కొంది. డెలివరీ సమయంలో రామ్ చరణ్ దగ్గరుండి నన్ను చాలా బాగా చూసుకున్నాడని, అలాంటి భర్త తనకి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చింది ఉప్సీ.
హైదరాబాద్‌లోని అపోలో విభాగంలో సింగిల్ మదర్స్ కి ఉచితంగా చిల్డ్రన్ విభాగాన్ని ప్రారంభించిన ఆమె గొప్ప నిర్ణయం తీసుకుంది. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఉపాసన మాట్లాడుతూ.. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో అందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించటంతో పాటు ఆశీర్వాదాలను కూడా అందించారు. నా ప్రెగ్నెన్సీ జర్నీని అద్భుతమైన జ్ఞాపకంగా చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. ప్రతీ తల్లికి కూడా ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ అవుతుంది. పుట్టిన పాపకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అవధులు ఉండవు
నేను ప్రగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా మంది నన్ను కలిసి ఎన్నో సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరి మహిళలకు ఇలాంటి సపోర్ట్ దొరకకపోవచ్చు. ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ పెద్దగా ఉండదు. నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలిని, కానీ సింగిల్ మదర్స్ నిఎవరు చూసుకుంటారు? కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని చేస్తున్నాను.. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నేను వారికి నా వంతు సపోర్ట్ అందించటానికి సిద్ధం అని ఉపాసన చెప్పుకొచ్చింది.