చిత్ర పరిశ్రమ అంటేనే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు స్టార్ లుగా అవుతూ ఉంటారు. ఇక అలాగే కమెడియన్ గా అల్రించడం అంటే మామూలు విషయం కాదు. అయితే కొందరు ఎంతో టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సార్లు వాళ్లు చేసిన పనులు వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలివలేకపోయారు. ఇక అలాంటి వారిలో తమిళ కమెడియన్ వడివేలు కూడా ఒక్కరు. టాలెంట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోయారు. అయితే ఇండస్ట్రీ అన్నాక కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే కెరీర్లో వెనక పడిపోతారు. అలాంటి పరిస్థితే ఈ కమెడియన్ కూడా జరిగింది అని తెలుస్తుంది. మరీ మూక్యంగా తన తోటి హీరోయిన్లతో సంబందలు పెట్టుకున్నీ వారి వాడుకున్నీ వదిలేసరే అన్నీ అయనపై ఎన్నో అరూపణలు వచ్చాయి.
ఇక వడివేలు తన కేరీర్లో వాడుకున్నీ వదిలేసిన హీరోయిన్ల విషచనికి వస్తే స్టార్ హీరోయిన్ శ్రీయ దగ్గర నుంచి సీనయర్ నటి అంబిక వరకు వడివేలు ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ లో పెట్టుకొని వారిని మోసం చేసి మధ్యలోనే వదిలేశారు. అదేవిధంగా సినిమాల్లో తనకు అవకాశం ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో కెప్టెన్ విజయకాంత్ ని కూడా వడివేలు నమ్మించి మోసం చేశాడు. వడివేలు తమిళ చిత్ర పరిశ్రమల స్టార్ కమెడియన్‌గా ఎదగటానికి ప్రధాన కారణం కెప్టెన్ విజయ్ కాంత్‌నే చెప్పాలి. ఆయన ద్వారానే వడివేలు కోలీవుడ్‌లో సినిమా అవకాశాలు అందుకున్నారు.
అలాంటి వడివేలు తనకు అవకాశాలు ఇప్పించిన విజయ్ కాంత్‌కే చెమటలుు పట్టించాడు. ఒక్కోనక్క సమయంలో విజయ్ కాంత్ అడిగినా కూడా తన సినిమాలో నటించకుండా ఆయనకే ఎదురు తిరిగాడు. ఇలా వడివేలు ఆయన కెరియర్ లో ఎందరో నటీనటులకు చుక్కలు చూపించాడు. అలాంటి వడివేలుకి సైతం తాను చేసిన తప్పు ఒకటైతే అసలు కారణం మాత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఇక వడివేలు కమిడియన్‌గా మంచి పామ్‌లో ఉన్న సమయంలో ఎన్నో వివాదలను ఎదురుకున్పరు. తమిళనాట అమ్మగా పిలిచే జయలలిత ఎంత మంచిదో నచ్చకపోతే అంతే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుందట.
తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులోను వడివేలుకు ఫ్యాన్స్ ఉన్నరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు కింగ్ లా బతికిన ఈ కమెడియన్.. ఇప్పుడు డల్ అయిపోయాడు. ఒకప్పుడు ఈయన పేరంటే తమిళనాట ఓ సంచలనం. ఒకప్పుడు తమిళ సినిమా కామెడీని శాసించిన రారాజు వడివేలు. ఆయన లేకుండా సినిమా చేయడం అనేది అసాధ్యం. ఒకే ఏడాదిలో 30 నుంచి 40 సినిమాలు చేసేవాడు వడివేలు. సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా కచ్చితంగా కమెడియన్ గా ఆయన ఉండాల్సిందే. ఈయన డేట్స్ కావాలంటే ఎంత పెద్ద నిర్మాతకైనా చమటలు పట్టేవి. చివరికి రజినీ అంతటివాడే ముందు వడివేలు డేట్స్ తీసుకుని తన దగ్గరికి రండి అనే స్థాయిలో ఉండేది ఆయన డిమాండ్. కానీ ఒక్క వివాదం వడివేలు కెరీర్ ను నాశనం చేసింది.
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వడివేలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. 2011 ఎన్నికల టైమ్ డిఎంకేకు ప్రచారం చేసిన వడివేలు. ఆ సమయంలో లో అమ్మ జయలలితతో పాటు రజినీకాంత్ కు వ్యతిరేకంగా పబ్లిక్ గా వడివేలు చేసిన కమెంట్స్ తమిళనాట సంచలనం సృష్టించాయి. వడివేలు కామెడి పంచులతో ఎండీఎంకే తో పొత్తుపెట్టుకున్న జయలలితపై = సెటైర్లు వేస్తూ ఆమె గాలితీశాడు. అమ్మ పరువు తీశాడు. ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే వడివేలు ప్రచారం చేసిన ప్రతి చోటా డీఎంకే డిజాస్టర్ అయ్యింది. అమ్మ అధికారంలోకి రాగానే రీవెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఈ దెబ్బకు వడివేలు సినిమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఆయనను సినిమాల్లోకి తీసుకోకూడదని నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేసింది జయ లలిత. దాంతో అప్పటికే వడివేలు నటించిన సిమాలను నిలిపివేసి ఆయన నటించిన సీన్లను ఎడిట్ చేసారు. అలా ఆవేశంతో తాను అన్న మాటలకు అప్పుడు ఒక్క సినిమా కూడా లేకుండా తన కెరీర్ నాశనం చేసుకున్నాడు వడివేలు.