Varuntej-Lavanya: త్వరలో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట జూన్ 9న సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఇండస్ట్రీతో పాటు ఫిలిం నగర్ వర్గాలలో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆగస్ట్ లో వరుణ్, లావణ్య పెళ్లి ఉంటుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే అది అవాస్తమని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో పెళ్లి జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎంగేజ్మెంట్ రోజే ఆ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు టాక్.
ఇక వీళ్ల పెళ్లి హైదరాబాద్ , ఇండియాలో కాకుండా ఫారిన్లో జరిపేందుకు మెగా ఫ్యామిలీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. వీరి ప్రేమకు పునాది పడిన ఇటలీ అయితే బెస్ట్ అని వారు ఫిక్స్ కావడంతో వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి మ్యారేజ్ ప్లేస్ ఇటలీ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీకి వెళ్లి అక్కడ ఏర్పాట్లని పరిశీలించి వచ్చారట. అక్కడే పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా చేసినట్టు సమాచారం. ఇక వీరి పెళ్లికి కేవలం మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరు కానుందని సమాచారం.
శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి తొలిసారి జంటగా నటించగా, ఆ మూవీ చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం ‘అంతరిక్షం’లో మరోసారి జంటగా నటించగా, ఆ స్నేహం ప్రేమగా కూడా మారింది కొన్నేళ్లుగా వీరి ప్రేమకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతుండగా, దానిపై స్పందించేందుకు వారు ఏ మాత్రం ఇష్టపడలేదు. సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకొని అందరికి షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలలకు వస్తే… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున అనే చిత్రం చేశారు. ఆగస్టు 25న ఆ విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక లావణ్యా త్రిపాఠి రెండు మూడు సినిమాలు చేస్తుండగా, మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.