Varun Tej Lavanya Marriage: శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్మెంట్కి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇకవీరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది, ఎలా చేస్తారు అనే దానిపై గత కొద్ది రోజులుగా అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఆగస్ట్‌లో పెళ్లి జరగనుందని కొందరు అంటుంటే మరి కొందరు వీరి వివాహం నవంబర్‌లో జరగనుందని చెప్పుకొస్తున్నారు.
ఇటలీ వేదికగా వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుందట. అయితే వారు ఇటలీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తుంది. మిస్టర్ మూవీ షూటింగ్ లో భాగంగా ఇటలీ వెళ్లిన వారు అక్కడే ప్రేమలో పడడంతో పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక వీరి పెళ్లికి సంబంధించి తాజాగా ఓ కొత్త ప్రచారం నడుస్తుంది. లావణ్య త్రిపాఠి రాయల్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో పెళ్లిని రాచకరిక పద్దతిలో చేయాలని అనుకుంటున్నారని, ఇప్పటికే కొన్ని మ్యారేజ్ ప్లానింగ్ సంస్థలు దీని కోసం పని స్టార్ట్ చేశాయని చెప్పుకొస్తున్నారు.
లావణ్య, వరుణ్ కోరిక విధంగా పెళ్ళికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు , కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారట. ఒక 50 మంది మాత్రమే పెళ్లి వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం ఇక పెళ్లి ముగిసిన వారం తర్వాత హైదరాబాద్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట. మొత్తంగా ఊహించని రేంజ్ లో వరుణ్ తేజ్ పెళ్ళికి అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. రానున్న రోజులలో దీనిపై పూర్తి క్లారిటీ అయితే రానుంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటనకు గుడ్ బై చెప్పారనే ప్రచారం కూడా జరుగుతుంది.