చిత్ర పరిశ్రమలో ఉన్నా కొంతమంది హీరోలకు కొన్ని పాత్రలు వాళ్ళ కోసమే పుట్టాయా అన్నట్టుగా అనిపిస్తాయి. ఆ పాత్రల కేవలం వాళ్ళు తప్ప మరెవరు చేయలేరు అన్నంతగా ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోతారు. అలాంటి హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఆయన హీరోగా నటించిన తొలిప్రేమ, తమ్ముడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో స్టోరీని పవన్ కళ్యాణ్ తన నటనతో డామినేట్ చేశారు.
ఆ రేంజ్ లో తన నటనతో ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ తప్ప మరి ఏ హీరో చేయలేడు అనే అంతల జీవించేస్తాడు. ఇదే సందర్భంలో ఇలా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఆ సినిమా మరేదో కాదు వాసు. పవన్ కళ్యాణ్ తో తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా స్టోరీ పరంగా పాటల పరంగా ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ కూడా ప్రేక్షకులను చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంత మంచి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలింది అంటే ఎవరూ నమ్మలేరు కానీ ఇది నిజం.
అందుకు కారణం గతంలో పవన్ కళ్యాణ్ ఇదే తరహా సినిమాల్లో ఇదే రకమైన పాత్రలు పోషించి, జనాల్లో నాటుకుపోయాడు. ఈ సినిమాని చూస్తున్నంతసేపు వెంకటేష్ ని ఎవ్వరూ చూడలేదు, ఆయన స్థానం లో పవన్ కళ్యాణ్ ని ఊహించారు. అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ కాలేదని అంటుంటారు విశ్లేషకులు. తొలిప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కరుణాకరన్ కి ఈ చిత్రం రూపంలో ఫ్లాప్ ఎదురైంది.