విడుదలకి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాలను సురేష్ బాబు ఓటీటీలకి పరిమితం చేయడంతో ఆయన మీద డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదు.. సినిమా అభిమానులు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాలని థియేటర్స్ లో చూడాలి అనుకునే ఆలోచనని స్వయంగా సురేష్ బాబు గారే వాళ్ళ మనసులో పెట్టారు కనుక.
ఈ మూవీ అనౌన్స్ చేసిన సంధర్భంలో.. లేదా చిత్ర షూటింగ్ పూర్తయిన సంధర్భంలో సురేశ్ బాబు సినిమాని థియేటర్ లోనే విడుదల చేస్తామని చెప్పారు. ముఖ్యంగా తమిళంలో మంచి హిట్ అయిన అసురన్ కి రీమేక్ గా వస్తున్న నారప్ప సినిమాని ప్రత్యేకంగా థియేటర్ లో ఎంజాయ్ చేయడం కోసమే నిర్మిస్తున్నట్టు చెప్పారు. కానీ చివరికి ఇలా ఓటీటీలకే పరిమితం చేయబోతున్నట్లు చెప్పడం వాళ్ళకి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.
అలాగే సినిమా పెద్దగా.. థియేటర్స్ మీద ఆధారపడి బ్రతికే చాలామంది పంపిణీదారులకి నష్టాలు వాటిల్లే ఛాన్స్ ని పరిశీలంచకపోవడం బాధాకరం అని వాళ్ళు వాపోతున్నారు. ఇలా పెద్ద సినిమాలన్నీ ఓటీటీలలోనే రిలీజ్ అవుతూ పోతే ఇక చివరికి థియేటర్స్ అనేవి మెల్లగా మూతపడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఒకసారి గమనించాలని వాళ్ళు వేడుకుంటున్నారు.
Leave a comment