Venu: ప్రేమలో పడితే మనం ఎలా ఉంటామో, ఎలా ప్రవర్తిస్తామో కూడా తెలియదు. కాని ఆ మైకం నుండి బయటపడ్డాక అసలు విషయాలు తెలుసుకొని తీవ్ర నిరాశ చెందడం వంటి సంఘటనలు చాలానే చూశాం. బలగంతో మంచి హిట్ అందుకున్న జబర్ధస్త్ కమెడీయన్ వేణు తన లవర్ కోసం చేసిన ఖర్చు గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు. వేణు అంటే మొన్నటి వరకు జబర్ధస్త్ కమెడీయన్‌గానే తెలుసు. కాని బలగం సినిమాతో ఆయనలోని దర్శకత్వ ప్రతిభ బయటకు తీసాడు. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డ్స్ రావడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు సైతం వచ్చాయి. రీసెంట్గా గ్రూప్ 4లో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్న వచ్చింది.
తాజాగా వేణు తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి వెల్లడించాడు. తనకి కూడా ఆటోగ్రాఫ్ లాంటి లవ్ స్టోరీ ఒకటి ఉందని చెప్పిన వేణు.. లవ్ వలన జరిగిన అవమానంతో మళ్లీ లవ్ చేయాలంటే భయం వేసిందని అన్నాడు.ఆర్టిస్ట్ అయిన సమయంలో వేణుకి ఓ అమ్మాయి నచ్చి ఆమెని లవ్ చేశాడు. తన పంచ్‌లకి ఆమె బాగా నవ్వేదట.అమ్మాయి ఇంటికి వెళ్లిన కూడా ఎవరు ఏమనేవారు కాదట. అంత కూల్‌గా నడుస్తుంది అనుకున్న సమయంలో ఓ రోజు ఫేక్ బర్త్ డే క్రియేట్ చేసుకుని ఆమెతోపాటు ఫ్రెండ్స్ అందర్నీ గోల్కొండ కోటకు తీసుకెళ్లి మధ్య మధ్యలో ఆమెతో సరదాగా మాట్లాడటం, జోకులేయడం అంతా చేశాను అని వేణు తెలియజేశారు.
సాయంత్రం కూడా తనతో ఎక్కువ సేపు గడపాలని అనిపించి నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లి ఓ పెద్ద హోటల్ డిన్నరిచ్చాను. ఇంటికొచ్చాక మొత్తం లెక్కలు వేసుకుంటే మొత్తం రూ. 25 నుంచి 30 వేలు అయింది. అయితే ఖర్చు కన్నా కూడా అందరిని గ్యాదర్ చేయడం, ఏర్పాట్లు చేసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. నా కోసం నా ఫ్యామిలీ అంతా ఎంతో చేస్తే.. వారి కోసం ఏమి చేయకుండా, ఓ అమ్మాయి కోసం ఇంత చేశాను. నా జీవితం గురించి ఆలోచించిన వాళ్ల కోసం ఏమి ఆలోచించలేదేంటి అని చాలా బాధపడ్డాను అని వేణు తెలియజేశారు. వేణు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.