1996 సంవత్సరంలో ‘ఎగిరే పావురమా’ సినిమాలో జ్యోతిగా కనిపించి సినీ తెరకి పరిచయం అయిన లైలా తర్వాత తమిళ, మలయాళ సినిమాలలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళ్ లో పెద్ద స్టార్ గా ఎదిగిందన్న మాట. వరుసగా 2001, 2003 సంవత్సరాలలో ఉత్తమ తమిళ నటిగా అవార్డులు కూడా తీసుకున్న లైలా గురించి కొన్ని విషయాలు..
ఆమె సౌత్ లో రాణించినప్పటికీ ఇక్కడికి చెందిన వ్యక్తి కాదు. గోవాలో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో పుట్టిన ఆమె తల్లి దండ్రులు, ఇంకా కుటుంబ సభ్యులు అందరూ ఇంగ్షీష్ మాట్లాడేవాళ్ళు. అలాగే ఫ్రెంచ్ కూడా మాట్లాడే లైలాకి ఇక్కడి సినీ వ్యక్తులతో పనిచేస్తున్న సమయంలో దక్షిణ భాషలైన తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషలని నేర్చేసుకుంది. ఇలా భాషల్ని నేర్చుకోగలగడం కూడా ఆమెని తొందరగా సినిమాల ద్వారా సక్సెస్ చూసే అవకాశాన్ని కల్పించింది.
ఒక భాష మాత్రమే కాదు.. తన అందమైన నవ్వు కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. 1980 అక్టోబర్ 24 న పుట్టిన ఆమె వయసు ప్రస్తుతం 40. ఇరాన్ కి చెందిన మెహ్ది అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. 2006 లో పెళ్లి చేసుకున్న లైలా చివరిగా తెలుగులో మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి సినిమాలో తెలుగువాళ్ళకి కనిపించారు. ఈ మూవీ 2004 సంవత్సరంలో వచ్చింది.
ఉగాది, శుభలేఖలు, పెళ్లి చేసుకుందాం వంటి సినిమాలు లైలాను తెలుగు వాళ్ళకి దగ్గర చేసాయి. ఐతే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి.. ఆమెకి మళ్ళీ తెర మీద కనిపించే ఆలోచన ఉందేమో.. ఇందుకోసం మంచి పాత్రలు వస్తాయని తెలుసుకునే ఆలోచనలో కూడా ఉన్నరేమో అని పలు ఇండస్ట్రీల వాళ్ళు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా తిరిగి సినిమాల్లోకి వచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లా మంచి సక్సెస్ చూసిన వాళ్ళు చాలా మంది హీరోయిన్లే ఉన్నారని చెప్పాలి. దేవయాని, మీనా, ఇంద్రజ, భూమిక వంటివాళ్ళు అందరూ మళ్ళీ హైలైట్ అయ్యారు. కానీ, భర్త వ్యాపారంలో పాలు పంచుకుంటూ ఎంతో సంతోషంగా బ్రతికేస్తున్న ఆమె మళ్ళీ ఇటువైపు వస్తారన్నది సందేహమే.
Leave a comment