500 కు పైగా సినిమాలు ఐదు భాషల్లో నటించిన సినీ ప్రస్థానం ఆమెది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఆమె తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు. కర్ణాటకకు చెందిన ఆమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లోనూ ఎన్నో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 76 ఏళ్ల జయంతి గారు 7 సార్లు రాష్ట్ర స్థాయిలో కర్ణాటక ప్రభుత్వం నుండి అవార్డ్ లు తీసుకున్నారు. అలాగే, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు కూడా ఆమె రెండిటిని సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటిగా ప్రెసిడెంట్ నుంచి కూడా మెడల్ తీసుకున్నారు ఆమె.
గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. రెస్ట్ తీసుకుంటున్న ఆమె ఉన్నపళంగా ఇలా నిద్రలోనే కళ్ళు మూసినట్టు ఆమె కుమారుడు కృష్ణ కుమార్ బెంగళూర్ టైమ్స్ కి తెలియజేశాడు. జయంతి చివరిసారిగా ఇదే బెంగళూర్ టైమ్స్ తో గతేడాది లాక్ డౌన్ టైమ్ లో మాట్లాడారు. 1960 ల నుండి 80 ల చివరిదాకా ఆమె చాలా ఆక్టివ్ గా సినిమాల్లో నటించారు. సాండల్ వుడ్ నుండి ఇంతలా పేరు తెచ్చుకున్న కొద్ది మంది నటీ నటుల్లో ఆమె ఒకరు కాబట్టి ఆమె మరణాన్ని ఒక పెద్ద లోటుగా భావిస్తున్నారు సినీ ప్రేమికులు.
కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెకి ‘అభినయ శారద’ అనే బిరుదుని ఇచ్చింది. 1965 లో జయంతి మిస్ లీలావతి అనే సినిమాలో నటించింది. ఆ మూవీ ఆమెకి ఎంతగానో గుర్తింపుని తీసుకువచ్చింది. కారణం.. ఆ రోజుల్లోనే ఈ సినిమా ద్వారా చాలా కేర్ ఫ్రీ గా ఉండే ఒక రోల్ ని ఆమె చేయడం.. అంటే సంప్రదాయాల్ని అన్నిటినీ ప్రశ్నించడం, పెళ్ళిని వద్దనడం, ఏదైనా కెరీర్ లో మంచి గుర్తింపు తీసుకురావాలి అనుకోవడం, అలాగే.. పెళ్లికి ముందే సెక్స్ తప్పు కాదనే పాత్రని ఆమె బ్రహ్మాండంగా పోషించి నటనలో తన టాలెంట్ ఎంతో నిరూపించుకున్నారు. RIP జయంతి గారు.
Leave a comment