Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన క్రేజ్ విదేశాలకి కూడా పాకిండి. విజయ్ దేవరకొండని చాలా మంది ఇమిటేట్ చేయాలని ట్రై చేస్తుంటారు. కెరీర్ లో పెద్దగా హిట్స్ లేకపోయిన కూడా కేవలం యాటిట్యూడ్‌తోనే విజయ్ దేవరకొండకి అంత పాపులారిటీ దక్కింది. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన విజయ్ ఆ తర్వాత హీరోగా మారి వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. అయితే కెరీర్ ఆరంభంలోనే విజయ్ దేవరకొండకు ఎన్ని హిట్లు వచ్చాయో.. ఆ తర్వాత అదే స్థాయిలో ఫ్లాపులు కూడా పలకరించాయి. విజయ్ నటించిన ‘ద్వారక’ అనే సినిమా, ‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.
కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. అయితే విజయ్ దేవరకొండ కెరీర్ మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అప్పట్లో తనకు బట్టలు వేసుకోవాలన్నా సరిగ్గా ఉండేవి కాడు… డబ్బులు లేక తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను… పదివేలు సంపాదించడానికి నానా రకాలుగా కష్టపడ్డాను. పదివేల కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధమయ్యాను. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసే వాడినని… అలానే ఎవరు ఏ పని చెప్పిన డబ్బుల కోసం ఆ పని చేసే వాడినని విజయ్ అన్నారు.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆస్తులు గురించి తెలిస్తే నోరెళ్లపెడతారు. హీరోగా తన సత్తా నిరూపించిన విజయ్ దేవరకొండ.. బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ అయ్యాడు. అతడి క్లాత్ బ్రాండ్ ‘రౌడీసకి మంచి ఆదరణ లభిస్తోంది. కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే బ్యానర్‌ను సైతం స్థాపించి ‘మీకు మాత్రమే చెబుతా సినిమా నిర్మించాడు. ఇక ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏక కాలంలో నాలుగైదు బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించాడు. షార్ట్ టైంలో మంచి పొజీషన్‌కి చేరుకున్న విజయ్ దేవరకొండ నికర విలువ దాదాపు రూ. 35 – 40 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల సమచారం. అతడు ఒక్కో సినిమాకు రూ. 10 – 12 కోట్లు చార్జ్ చేస్తున్నాడని అలానే యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తాడని సమాచారం. విజయ్ దేవరకొండకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ విలాసవంతమైన భవనం ఉండగా, దీని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందట. అలాగే, అతని కార్లు ఇతర యాక్సిసిరీస్‌ల విలువ రూ. 8 – 10 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.