Vijay Deverakonda took off his shirt.. but he simultaneously pulled the heroine's saree..!
Home Film News Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ష‌ర్టే విప్పాడు.. వీడు మాత్రం ఏకంగా హీరోయిన్ చీరే లాగేశాడుగా..!
Film News

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ష‌ర్టే విప్పాడు.. వీడు మాత్రం ఏకంగా హీరోయిన్ చీరే లాగేశాడుగా..!

Vijay Devarakonda: ఈ రోజుల్లో సినిమా ప్ర‌మోష‌న్స్ పేరుతో హీరో హీరోయిన్స్ చేసే ర‌చ్చ మాములుగా లేదు. వెండితెర‌పైన వీరి రొమాన్స్ చూసేందుకు కొంద‌రికి ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్స్ ఈవెంట్‌లోను ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌కుండా నానా హంగామా చేస్తున్నారు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత న‌టించిన ఖుషి సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ స్టేజ్‌పై ఏకంగా ష‌ర్ట్ విప్పి స‌మంత‌తో ర‌చ్చ చేశాడు. త‌న పేరెంట్స్ ముందే విజ‌య్ .. స‌మంత‌ని గాల్లోకి ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ త‌ర్వాత ఆమె క‌ళ్ల‌లోకి చూస్తూ హంగామా సృష్టించాడు. దీనిపై నెటిజ‌న్స్ నుండి అనేక విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక దీనిని ఆద‌ర్శంగా తీసుకొని మాస్ కా దాస్ విశ్వ‌క సేన్ స్టేజ్ పై అంద‌రి ముందు హీరోయిన్ చీర లాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

విశ్వక్ సేన్, నేహాశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం  “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ  చిత్రంలోని  మొదటి సాంగ్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో తాజాగా రిలీజ్ చేశారు . ఈ పాటలోని ఓ డ్యాన్స్ మూమెంట్ ని వేస్తూ ఏకంగా స్టేజీ పై హీరొయిన్  కొంగుని తీసి తన ఒంటికి చుట్టేసుకుంటాడు విశ్వక్ సేన్. అంతేకాదు ఆ కొంగు నోట్లో పెట్టుకొని ఆమెను రొమాంటిక్ టచ్ చేస్తూ బీట్స్ కి అనుగుణంగా డ్యాన్స్ చేశాడు. ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. స్టూడెంట్స్ ముందు ఇలాంటి స్టెప్స్ ఏంటి ..? అంటూ కొంద‌రు ఆయ‌న‌పై మండిపడుతున్నారు విజయ్ కేవలం షర్ట్ మాత్రమే విప్పితే ..నువ్వు ఏకంగా చీర కొంగే తీసేసావు కదా అంటూ  దారుణ‌మైన ట్రోల్ చేస్తున్నారు. విజ‌య్, విశ్వ‌క్ సేన్‌ల‌ని చూసి ఇత‌ర హీరోలు ఇంకేం చేస్తారో అని ముచ్చ‌టించుకుంటున్నారు.

హీరో విశ్వక్ సేన్ తన అగ్రెసివ్ యాటిట్యూడ్ తో మాస్ కా దాస్ అనే పేరు తెచ్చుకున్నాడు. త‌న‌కంటూ  సపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇత‌డు  బోల్డ్ గా నటిస్తూ, విభిన్నమైన కథలపై పాత్రలపై ఎక్కువ  ఫోకస్ పెడుతున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రాలు ఓ మోస్త‌రు విజ‌యం సాధిస్తున్నాయే త‌ప్ప  బ్లాక్ బస్టర్స్ కావడం లేదు. పెద్ద బ్రేక్   కోసం విశ్వక్ సేన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. మ‌రి ఇప్పుడు ఈ సినిమాతో అయిన విశ్వక్ సేన్ పెద్ద విజ‌యం అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...