Vijayanirmala: సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఓ మంచి ఇమేజ్ ఉంది. ఇక కృష్ణ, విజయ నిర్మల జంట అన్నా కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో విడివిడిగా పెళ్లిళ్లు జరిగినా.. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం కారణంగా వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి విజయనిర్మల, కృష్ణలు ఎంతో ఆనందంగా జీవితం గడిపారు. సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ పోటీతత్వం ఉంటుంది. అది హీరోల విషయమైనా.. హీరోయిన్ల విషయమైనా.. ఆ పోటీతత్వం కొనసాగుతుంది. అలాగే విజయనిర్మల, కృష్ణకు ఓ హీరోయిన్ తో మాత్రం సినిమాలు చేయకూడదని ఓ కండీషన్ పెట్టారట. మరి ఆ హీరోయిన్ ఎవరు. అసలు ఈ కండిషన్ ఎందుకు పెట్టారనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
విజయనిర్మలకు, హీరోయిన్ వాణి శ్రీ అంటే అస్సలు పడేది కాదట. నిజానికి వీరిద్దరూ కూడా కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఫ్రెండ్స్. కానీ విజయనిర్మల యాక్ట్ చేసిన దేవదాస్ మూవీ రిలీజ్ టైమ్ లో వాణిశ్రీ ఈ మూవీపై కౌంటర్ వేశారట. కమెడియన్ రమాప్రభతో కలిసి కూర్చుని విజయనిర్మల నటించిన దేవదాస్ మూవీ గురించి వాణి శ్రీ మాట్లాడుతూ. అప్పట్లో ఏఎన్ఆర్ యాక్ట్ చేసిన సినిమా దేవదాస్ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసినా.. వంద రోజులు ఆడుతుంది, కానీ విజయనిర్మల నటించిన దేవదాస్ చూడటానికి సినిమా హాల్లో దోమలు తప్ప మనుషులు ఉండరు అని వెటకారంగా అన్నారట.
అక్కడే ఉన్న విజయనిర్మల ఈ మాటకు చాలా కోపం వచ్చి.. వాణిశ్రీని అక్కడే తిట్టి.. మూవీ గురించి నీకు అవసరమా అని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఆ విషయమే కృష్ణకు చెప్పి ఆ హీరోయిన్ నటించవద్దని కండిషన్ పెట్టారట. ఆ తర్వాత 16 ఏళ్ల తర్వాత దర్శకులు నచ్చజెప్పడంతో వాణిశ్రీతో ఓ మూవీ చేసేందుకు కృష్ణ ఒప్పుకోవడం, షూటింగ్ టైమ్ లో విజయనిర్మలకు విషయం తెలియడంతో సెట్ కు వచ్చి నాాన గొడవ చేసి కృష్ణను తీసుకెళ్లిపోయిందట. అప్పుడు కృష్ణ ప్లేస్ లో సుమన్ ను హీరోగా పెట్టి రావు గారింట్లో రౌడీ అనే మూవీ పూర్తి చేసారు.