Ponniyin Selvan 1: క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుబాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్యర్య రాయ్, ప్రకాష్ రాజ్, జయరామ్, జయచిత్ర, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, పార్థిబన్, ప్రభు లాంటి బిగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తుండడంతో భారీ అంచనాలున్నాయి.
సోమవారం చియాన్ విక్రమ్ ‘ఆదిత్య కరికాలన్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మంగళవారం కార్తీ నటిస్తున్న ‘వంతియ తేవన్’ లుక్ రివీల్ చేశారు. ఇద్దరి లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 సెప్టెంబర్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Leave a comment