Home Film News కమల్ నట విశ్వరూపం ‘విక్రమ్’
Film NewsReviews

కమల్ నట విశ్వరూపం ‘విక్రమ్’

VIKRAM Movie Review
VIKRAM Movie Review

యూనివర్సల్ స్టార్, లోక నాయకుడు కమల్ హాసన్ కొంత గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ‘ఖైది’, ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. మూడో సినిమాకే కమల్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో వర్క్ చెయ్యడంతో సీనియర్‌ని ఎలా చూపిస్తాడోననే క్యూరియాసిటీ కలిగింది. దీంతో పాటు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కూడా నటించడంతో అంచనాలు పెరిగిపోయాయి.

కమల్ కెరీర్‌లో 232వ సినిమా ఇది. టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌లో డైరెక్టర్ సరికొత్త కమల్ హాసన్‌ని చూపించాడు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రమోషన్స్ అదరగొట్టేశారు. విలక్షణ నటుడు సూర్య, కార్తి కూడా ఈ సినిమాలో ఉన్నారని రివీల్ చెయ్యడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపయ్యింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘విక్రమ్’ ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది.

కథ..
మాస్క్ మాన్ పేరుతో సిటీలో అనేక కిడ్నాపులు జరుగుతుంటాయి. ఆ కేసుని చేధించడానికి పోలీస్ ఆఫీసర్ అమర్ (ఫాహద్ ఫాజిల్) దర్యాప్తు చేస్తుంటాడు. ఆ ప్రాసెస్‌లో సంతానం (విజయ్ సేతుపతి) అనే గ్యాంగ్ స్టర్ హ్యాండ్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. అరుణ్ కుమార్ విక్రమ్ (కమల్) రిటైర్డ్ రా ఏజెంట్.. ఈ కేసు గురించి ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంటాడు.. కిడ్నాప్స్ చేస్తున్న మాస్క్ మాన్‌తో పాటు ఆ మిషన్ ఏంటనేది తెలుసుకున, ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది..

నటీనటులు..
కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. అయితే ఈ వయసులోనూ ఆయన ‘విక్రమ్’ క్యారెక్టర్‌లో చెలరేగిపోయిన విధానం చూస్తే.. షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతాం. పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్‌లోనూ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారాయన. ఇంట్రడక్షన్‌లోనే ‘విక్రమ్’ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించారు. ఇక విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఇద్దరూ మంచి ఆర్టిస్టులే అనే సంగతి తెలిసిందే.. వాళ్ల రోల్స్‌లో ఇద్దరూ ఇరగదీసేశారు. నరేన్, అర్జున్ దాస్‌తో పాటు మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఆకట్టుకుంటాయి.

టెక్నీషియన్స్..
స్టైలిష్ యాక్షన్ ఫిలింస్ తియ్యడంలో లోకేష్ స్టైలే వేరు.. ‘ఖైది’ మూవీ కథతో పాటు పాత్రల్ని కూడా ఇందులో ఇన్‌వాల్వ్ చేస్తూ మంచి స్టోరీ, దానికి తగ్గట్టు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే రాసుకుని.. దాన్ని అంతే తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనిరుధ్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసాడు.. గిరీష్ గంగాధరన్ విజువల్స్ కూడా హైలెట్ అయ్యాయి.. సినిమాలో ప్రతి ఫ్రేముని రిచ్‌గా చూపించారు.. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ కూడా బాగానే ఉంది..

‘విక్రమ్’ గురించి ఒక్క మాటలో..
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. కమల్ వన్ మెన్ షో..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...