Virata Parvam: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన లవ్ అండ్ రివల్యూషనరీ మూవీ ‘విరాట పర్వం’. జాతీయ అవార్డ్ పొందిన నటీమణులు నందితా దాస్, ప్రియమణిలతో పాటు సీనియర్ నటి జరీనా వహాబ్, కీలకపాత్రలు పోషించారు. యంగ్ యాక్టర్ నవీన్ చంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్లో నటించాడు.
వరంగల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, నక్సలిజం బ్యాక్ డ్రాప్లో రూపొందిన ‘విరాట పర్వం’ ప్రోమోస్ ప్రామిసింగ్‌గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రానా, సాయి పల్లవిల నటన పోటా పోటీగా ఉండబోతుందనే అంచనాలకి వచ్చేశారు ప్రేక్షకులు.. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ‘విరాట పర్వం’ ఎలా ఉందో చూద్దాం..
కథ…
వరంగల్ జిల్లాలోని ఓ పల్లెటూరికి చెందిన సాధారణ యువతి వెన్నెల (సాయి పల్లవి), కామ్రేడ్ అరణ్య, అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితమవుతుంది. ప్రేమించడం మొదలు పెడుతుంది. ఎలాగైనా తననోసారి కలవాలనుకుంటుంది. దళనాయకుడైన రవన్న కోసం పోలీసులు గాలిస్తున్న టైంలోనే వెన్నెల అతని వెతుక్కుంటూ ఇళ్లు వదిలి వచ్చేస్తుంది. అయితే ఆమె రవన్నకి కలిసిందా?.. తన ప్రేమను చెప్పిందా?.. వెన్నెల ప్రేమని రవన్న అంగీకరించాడా?.. అసలేం జరిగింది అనేది మిగతా కథ..
నటీనటులు…
రానా సినిమా సినిమాకీ నటుడిగా తననితాను సాన బెట్టుకుంటున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్, యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘విరాట పర్వం’ లో రవన్న పాత్రలో కొత్త రానా కనిపిస్తాడు. నటన, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్.. ఇలా కామ్రేడ్ రవన్న క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. విప్లవానికీ, ప్రేమకీ మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా కొన్ని సీన్స్‌లో చాలా మంచి నటన కనబరిచాడు.
సాయి పల్లవి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. ఎప్పటిలానే ది బెస్ ఇచ్చింది.. అంతకంటే ఎక్కువే ఇచ్చింది అనడం కరెక్ట్.. వెన్నెల క్యారెక్టర్ ఆమె తప్ప మరెవరూ చెయ్యలేరు అనేంతగా అలరించింది. ఓ మధ్య తరగతి యువతిగా రవన్నని ఇష్టపడడం, ప్రేమ కోసం వెళ్లి ఉద్యమంలో చేరడం.. ప్రేమికుడితో కలిసి పోరాటంలో పాల్గొనడం.. స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్లోనూ కళ్లన్నీ తనవైపు తిప్పేసుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ చెప్పినట్లు సాయి పల్లవి పర్ఫార్మెన్స్కి అవార్డ్ రావాల్సిందే. మిగతా నటీనటులంతా కూడా ఎమోషనల్‌గా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
టెక్నీషియన్స్…
ఫస్ట్ సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ తో దర్శకుడిగా మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల.. 1970 ప్రాంతంలో వరంగల్ జిల్లాలో జరిగిన వాస్తవిక సంఘటలన ఆధారంగా ‘విరాట పర్వం’ కథ రాసుకున్నాడు. ప్రేమకీ, ఉద్యమానికీ ముడిపెడుతూ చాలా హృద్యంగా తెరకెక్కించారు. సినిమా 1970 నుండి 1990ల మధ్య కాలంలో జరుగుతుంది. ప్రతీ క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తూ.. చాలా బాగా తెరకెక్కించాడు.
విజువల్స్ సినిమాను మరింత అందంగా చూపించాయి. సాయి పల్లవితో పాటు సురేష్ బొబ్బిలి సంగీతం కూడా సినిమాకి మెయిన్ ఎసెట్.. పాటలు, పద్యాలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా రోమాలు నిక్కబొడుచుకును స్థాయిలో ఉన్నాయి..
ఓవరాల్‌గా…
వాస్తవిక సంఘటనలకు సినిమా అంశాలు జోడించిన ‘విరాట పర్వం’ ఆకట్టుకుంటుంది.. భావోద్వేగానికి గురిచేస్తుంది..
Leave a comment