Virata Parvam: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా వేణు ఊడుగుల దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన లవ్ అండ్ రివల్యూషనరీ మూవీ ‘విరాట పర్వం’. జూన్ 17న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఆదివారం (జూన్ 12)న వరంగల్‌లో
‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. రీసెంట్గా ‘ఛలో ఛలో’ అనే వారియర్ సాంగ్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘విరాట పర్వం’ విప్లవానికి, ప్రేమకి.. ఉద్యమానికీ, ఉద్యమ కారుల జీవితాలకీ, హక్కులకీ సంబంధించిన కథ.
1992 ప్రాంతంలో ఓరుగల్లులో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. సాయి పల్లవి ‘వెన్నెల’ అనే క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రకి రియల్ లైఫ్‌లో స్ఫూర్తి, ఒకప్పటి మావోయిస్టు సరళ.. ఆమె ఇప్పుడు లేరు. సరళ తల్లిని ‘విరాట పర్వం’ టీమ్ వరంగల్‌లో కలిశారు. రానా, సాయి పల్లవి, డైరెక్టర్ ఆమెకి సినిమా గురించి చెప్పారు. సాయి పల్లవి తన క్యారెక్టర్ గురించి చెప్తూ.. పెద్దామె తనపట్ల సొంత కూతురిలా ఆప్యాయత చూపించారని.. తన కూతురితో మాట్లాడుతున్నానుకునే ఆమె తనతో మాట్లాడారు.. అంటూ పెద్దావిడ మాటలకు కంటతడి పెట్టింది.
జాతీయ అవార్డ్ పొందిన నటీమణులు నందితా దాస్, ప్రియమణి కీలకపాత్రలు పోషించారు. నవీన్ చంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నాడు. సురేష్ బొబ్బిలి సంగీతమందించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్, ఎస్ఎల్వి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Leave a comment