GK Reddy – Raviteja: సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు యంగ్ హీరో విశాల్ తండ్రి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఆయన ఫొటోలను తెగ షేర్ చేసుస్తున్నారు. రవితేజ ఫ్యాన్స్ ఏంటి.. విశాల్ తండ్రి పిక్స్ షేర్ చేయడమేంటి అనుకుంటున్నారా?
మేటర్ ఏంటంటే.. రవితేజ హీరోగా.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’.. ‘పెళ్లిసందD’ బ్యూటీ శ్రీలీల హీరోయిన్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్‌కి విశాల్ తండ్రి జికె రెడ్డి వచ్చారు.
జికె రెడ్డి ప్రముఖ నిర్మాత, బిజినెస్ మెన్.. తెలుగు వారైన రెడ్డి చెన్నైలో స్థిరపడ్డారు. పెద్దకొడుకు విక్రమ్ కృష్ణ నిర్మాతగా సినిమాలు చెయ్యగా.. చిన్న కొడుకు విశాల్ తమిళ్‌తో పాటు తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జికె రెడ్డి వయసు 80 సంవత్సరాలకు పైనే.. కొద్ది రోజుల క్రితం ఆయన ఫిట్‌నెస్ న్యూస్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ధమాకా’ టీమ్‌ని జికె రెడ్డి కలిసిన పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
Leave a comment