Tanikella Bharani: సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. గాయకుడిగా కూడా తనికెళ్ల భరణికి మంచి పేరు ఉంది. అయితే ఆయనకి ఓ యూట్యబ్ ఛానెల్ ఉండగా, దీనిని తొమ్మిదేళ్ల క్రితం మొదలుపెట్టారు. ఇటీవల ఈ ఛానెల్లలో సినీ ప్రముఖుల గురించి, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తనని కొట్టడానికి ఆడవాళ్లు వచ్చారని తెలియజేశారు తనికెళ్లభరణి.
సినిమాలలో చాలా కఠినంగా, భయంకరంగా కనిపించే తనికెళ్ల భరణి బయట మాత్రం చాలా సున్నితమైన మనిషి.ఆయన ఏ పాత్ర చేసిన ఆ పాత్రకి ప్రాణం పోసేవారు. మాతృదేవోభవ వంటి సూపర్ హిట్ సినిమా లో హీరోయిన్ ని ఏడిపించే కిరాతకమైన విలన్ పాత్రలో తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చలు నడిచేవి. మహిళా ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఆదరించారు. సాధారణంగా సినిమా ప్రభావం ప్రేక్షకులపై తప్పక ఉంటుంది. కాని ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండడంతో చిత్రంలో విలన్ గా చేసిన తనికెళ్ళ భరణి పై మహిళలు కొంత మంది కోపం పెంచుకున్నారట.
సినిమా రిలీజైన చాలా రోజుల తర్వాత తనికెళ్ల భరణి బయట కనిపించగా, ఆయనని కొట్టడానికి వెళ్లారట మహిళలు. సినిమాలో ఆయన చూపించిన క్రూరత్వం తట్టుకోలేక కొందరు మహిళలకు కొట్టడానికి వెళ్లారట. ఈ విషయం స్వయంగా తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. తనికెళ్ల భరణి సినిమాలలో ఎప్పుడు విలన్ గా కనిపించి మెప్పించేవారు. ఆయన ఇప్పుడు చాలా తగ్గించారు. అడపాదడపా మాత్రమే సందడి చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన తనికెళ్ళ భరణి. రైటర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ తర్వాత నటుడిగా ఎన్నో పాత్రలకు జీవం పోసి.. దర్శకుడిగా, రచయితగా తన ప్రత్యేకతను చాటుకున్నారు.