Movie: సినిమా అనేది మనుషులపై ఎంతో ప్రభావం చూపుతుందనే విషయం మనకు తెలిసిందే. సాధారణంగా కొందరు అభిమానులు వారి అభిమాన హీరోల స్టైల్‌ని, యాక్షన్‌ని ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు. సినిమాలలో హీరోలు చేసినట్టు తాము చేయాలని అనుకుంటారు. సినిమాల వలన కలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే ఒక సినిమా వలన చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం అందరిని కలిచివేసింది. చాలా మంది గొప్ప సినిమాలు తీస్తారు.కాకపోతే అందరు ఎమోషన్ని అంతగా క్యారీ చేయలేరు. కాని డైరెక్టర్ బాలచందర్ మరో చరిత్ర సినిమాతో ప్రేమిస్తే కలిసి ఉండాలి లేదంటే కలిసి చచ్చిపోవాలి అనే ఒక సూత్రం తెలిపి చాలా మంది ప్రేమికుల మరణానికి కారణం అయ్యాడు.
కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ సరిత జంటగా రూపొందిన చిత్రం మరో చరిత్ర. ఈ చిత్రం చివరలో ప్రేమలో విఫలమయ్యామని హీరో, హీరోయిన్స్ భావించి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ సన్నివేశం ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించింది. ఇక యూత్‌కి ఎంతగానో ఈ సినిమా కనెక్ట్ కాగా, ఈ చిత్రం రిలీజ్ తర్వాత దాదాపు 20 మంది జంటలు లెటర్స్ రాసి ఆత్మహత్యలు చేసుకున్నారట. వివిధ రకాల కారణాల వలన ఇంట్లో వారు తమ ప్రేమకి అడ్డు చెప్పడంతో సినిమాని ఇన్సిపిరేషన్‌గా తీసుకొని సూసైడ్ చేసుకోడం వలన మానవ హక్కుల సంఘాలు బాలచందర్ ని చాలా తిట్టారు..
ఇక ఈ మూవీ 200 రోజుల ఫంక్షన్ కార్యక్రమంలో బాలచందర్ చాలా బాధపడ్డారు. ఈ సినిమా తీయడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. దయచేసి నన్ను క్షమించండి. యూత్ ని ఆకట్టుకునేలా చేసే సినిమాలు మరోసారి తీయను అంటూ చాలా బాధపడ్డారు బాలచందర్. ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలని అనుకున్నారు బాలచందర్. కాని కమల్ హాసన్ అడ్డుపడ్డారు. ఈ క్రమంలో తెలుగు బాషలోనే విడుదల చేసి తమిళ్ లో సబ్ టైటిల్స్ వేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం భారీ విజయం సాధించింది. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా, అక్కడ కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.