Kajal: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో తేజ ఒకరు. ఆయన తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్స్ తీసారు. ఇటీవల మాత్రం పెద్దగా అలరించలేకపోతున్నారు. ఇటీవల దగ్గుబాటి రామానాయుడు మనవడితో కలిసి అహింసా అనే చిత్రం చేయగా, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.అయితే తేజ దర్శకత్వంలో పని చేస్తే వారికి చెంప దెబ్బలు లేదా బెల్ట్ దెబ్బలు పడడం ఖాయం అని ఓ టాక్ ఉంది. ఎవరైన సరిగ్గా నటించకపోతే వారిపై చేయి చేసుకోవడం తేజకి అలవాటు అని చాలా మంది అంటుంటారు. ఉదయ్ కిరణ్, సదా, నితిన్ వంటి వారు కూడా తేజ చేతిలో తన్నులు తిన్నవారే అని పలువురు నటులు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే ఈ దర్శకుడు కాజల్ అగర్వాల్‌ని బెల్ట్‌తో కొట్టాడట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్ కొన్ని సీన్స్ సరిగ్గా చేయని కారణంగా ఆమెపై బాగా అరిచేవారట. ఎన్నిసార్లు చెప్పినా నీ తీరు మార్చుకోవా అంటూ తేజ ఆమెను సెట్స్‌లోనే బెల్ట్ తో కొట్టాడంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కాని అవి రూమర్స్ అని కొందరు కొట్టిపడేసారు. అయితే అప్పట్లో తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కాజల్ ని చాలా తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు అది చూసిన జనాలు నిజంగానే కాజల్ ని కొట్టాడు కావచ్చు అని అనుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ ఆమెకు అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా రాదు, నటించడం అస్సలే రాదు.
నేను 30 రోజులలో కంప్లీట్ చేయాల్సిన షూటింగ్ కాజల్ వలన 60 రోజులకి పోయింది. డైలాగ్స్ మర్చిపోతుంది, సరిగ్గా ఎమోషన్స్ పండించలేదు. ఎప్పుడు వెనక నుండి డైలాగ్స్ అందిస్తూ ఉండాలి అంటూ తేజ పలు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విన్న ఆడియన్స్ చిన్న తప్పు చేస్తేనే చెంప చెళ్లుమనిపించే తేజ .. ఆమెపై అన్ని అభాండాలు వేస్తున్నాడంటే కొట్టిన కొట్టే ఉంటాడు అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దర్శకుడు కాకముందు తేజ ఒక స్టార్ సినిమాటోగ్రాఫర్. తెలుగు సినిమాలతో పాటు హిందీలో కూడా దాదాపు 10 సినిమాలకు పైగా కెమెరామెన్ గా పనిచేసిన ఆయన..ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో అసిస్టెంట్ గా పనిచేసి అనంతరం దర్శకుడి అవతారం ఎత్తాడు.