Varun Tej Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జూన్ 9న రాత్రి ఎనిమిది గంటలకు నిశ్చితార్థంతో ఒక్కటయ్యారు. ఇన్నాళ్లు వీరి ప్రేమ, పెళ్లికి సంబంధించి అందరిలో అనేక అనుమానాలు నెలకొనగా, ఈ వేడుకతో వాటన్నింటికి పులిస్టాప్ పడింది.చాలా అట్టహాసంగా జరిగిన నిశ్చితార్థం వేడుకకి మెగా, అల్లు కుటుంబ సభ్యులు అందరు హాజరయ్యారు. అయితే అసలు వీరి ప్రేమ ఎప్పుడు మొదలైంది, ఇన్నాళ్లు ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు అనేది అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ అనే చిత్రాన్ని దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. 2017లో విడుదలైన ఈ మూవీ దారుణమైన ఫ్లాప్ చవి చూసినప్పటికీ ఈ చిత్రం మాత్రం వరుణ్ తేజ్-లావణ్యలని కలిపింది.
మిస్టర్ మూవీ సెట్స్ లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల మధ్య ఏర్పడిన స్నేహం మెల్లమెల్లగా ప్రేమగా మారింది. మిస్టర్ సినిమా తర్వాత నుండి ఈ ఇద్దరు తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారట.అలా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకటే కావడంతో ఒకరిపై మరొకరికి చాలా ఇష్టం ఏర్పడింది. అలా 2018లో వచ్చిన అంతరిక్షం చిత్రంలో మరోసారి కలిసి నటించారు. అప్పుడు ఇద్దరు మరింత దగ్గర కావడం, వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని అనడం, దానికి లావణ్య త్రిపాఠి ఎస్ చెప్పడం జరిగిపోయిందట. ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య చాలా సీక్రెట్‌గా రిలేషన్ నడుస్తూ వచ్చింది.
2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరగగా, ఆ వేడుకకి మెగా కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం అందింది. పరిశ్రమ నుండి మాత్రం లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అవ్వడం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లమధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే ప్రచారాలు జరగడం మనం చూశాం. అయితే
ఈ వార్తలని లావణ్య ఖండిస్తూ వచ్చింది. ఒక ప్రక్క పీకల్లోతు ప్రేమలో ఉండి కూడా మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అబద్దం చెప్పంది లావణ్య. అయితూ ఆమె అలా చెప్పినప్పటికీ ఎక్కోడో ఓ మూల వీరిద్దరి వ్యవహారంకి సంబంధించి అనేక అనుమానాలు అందరిలో ఉన్నాయి. వీటన్నింటికి ఈ ఎంగేజ్మెంట్ తెరదించింది.