Avika Gor – Tejaswi Madivada: సాధారణంగా ఇద్దరు ఆడవాళ్లు కలిస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే.. అందులోనూ ఇద్దరు ఫీమేల్ సెలబ్రిటీలు కలిశారంటే ఇక సందడే సందడి.. అవికా గోర్, తేజస్వి మదివాడ ఇద్దరూ కలిసి సరాదాగా ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ వీరిద్దరూ ఎందుకు కలిశారు.. ఏంటా హంగామా అంటే.. జూన్ 30న అవికా గోర్ బర్త్‌డే.. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిశారు. అవికాతో కేక్ కట్ చేయించి, విషెస్ చెప్పి, సందడి చేసింది తేజస్వి. వాళ్ల ఫన్నీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి వీడియోలో. ఇద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో అర్థమవుతుంది.
ఈ వీడియోలో ఇద్దరూ సూపర్ హాట్‌గా ఉన్నారంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత అవికా తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తుంది. నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. శ్రీరామ్‌తో కలిసి నటించిన ‘టెన్త్ క్లాస్ డైరీస్’, ‘పాప్ కార్న్’ మూవీస్ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. తేజస్వి తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 2’ తర్వాత ‘బిగ్ బాస్ నాన్ స్టాప్ 1’ లోనూ కంటెస్టెంట్‌గా పార్టిసిపెట్ చేసింది. కొద్ది రోజులుగా సినిమాలేవీ చెయ్యట్లేదు.
https://www.instagram.com/p/CfayVcwpwm7/
Leave a comment