Richest Heroes: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలా అడ్వర్టైజ్ మెంట్స్ కి కూడా యాడ్స్ లో యాక్ట్ చేస్తూ డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక ఇండియాలోనే టాప్ 10 రిచ్ హీరోల లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలివుడ్, శాండిల్ వుడ్.. ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషికం తీసుకునే స్టార్స్ ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో రిచ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఐపీఎల్ లో షారుఖ్ కు సొంత టీమ్ కూడా ఉంది. ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది. అతని ఆస్తి మొత్తం 6,300 కోట్ల రూపాయలు. ఆ తర్వాత హృతిక్ రోషన్. ఆయన ఒక్కో మూవీకి 50 నుండి 60 కోట్లు తీసుకుంటారు.
ఇక బ్రాండ్ ప్రమోషన్ కోసం అయితే దాదాపు పది కోట్లు తీసుకుంటారు. ఆయన ఆస్తి 3100 కోట్ల రూపాయలు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఒక్కో మూవీకి పది కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తారు. ఆయన ఆస్తి దాదాపు 3000 కోట్ల రూపాయలు. సల్మాన్ ఖాన్ కూడా ఎన్నో సినిమాలు, అడ్వర్టైజ్ మెంట్స్ లో యాక్ట్ చేస్తుంటారు. ఆయన ఆస్తి 2,600 కోట్లు ఉంటుందని అంచనా. నెక్ట్స్ అక్షయ్ కుమార్. ఆయన ఆస్తి 2,660 కోట్ల రూపాయలు. ఇక గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు కూడా నటుడిగా చాలా డిమాండ్ ఉంది. ఆయన ఆస్తి 1,370 కోట్ల రూపాయలు. అక్కినేని నాగార్జునకు కూడా సినీ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది.
ఆయన ఆస్తి 950 కోట్ల రూపాయలు ఉందని సమాచారం. ఇక బిగ్ బాస్ కోసం దాదాపు 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. నెక్ట్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తన క్రేజ్ తో కంటిన్యూ అవుతున్నారు. ఆయన రీసెంట్ గా యాక్ట్ చేసిన జైలర్ మూవీ సక్సెస్ ఫుల్ హిట్ తో దూసుకుపోతోంది. ఆయన ఆస్తి 450 కోట్లకు పైనే ఉంటుంది. నెక్ట్స్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆస్తి మొత్తం 380 కోట్ల రూపాయలు ఉంటుంది. అల్లు అర్జున్ కి సొంత మల్టిప్లెక్స్ కూడా ఉంది.