Mohan Babu: తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖ నటులలో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఒకరు. హీరోగా, విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటారు మోహన్ బాబు. విభిన్న పాత్రలు పోషించి అభిమానుల మెప్పు పొందిన మోహన్ బాబు… దర్శకుడిగా, సహాయ నటుడిగా,నిర్మాతగా ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా కూడా తనదైన సేవలు అందించారు. తన కెరీర్‌ని అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టిన మోహన్ బాబు ఆ తర్వాత దాసరి నారాయణ దర్శకత్వం వహించిన “స్వర్గం నరకం” చిత్రం ద్వారా నటుడిగా తెరగ్రెటం చేశాడు. ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే మోహన్ బాబు తన పర్సనల్ లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
తని మెుదటి భార్య ఆకస్మిక మరణం తర్వాత ఆమె చెల్లిలినే మోహాన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు. మోహన్ బాబు చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే విద్యావతి అనే అమ్మాయితో ఆయన వివాహం జరిగింది. వీరి సంసారం చాలా రోజుల పాటు సజావుగానే సాగింది. వీరి వైవాహిక జీవితంలో దంపతులిద్దరికి మంచు విష్ణు, మంచు లక్ష్మి జన్మించారు. వారు జన్మించిన కొద్ది రోజులకి మెుదటి భార్య విద్యావతి ఆకస్మక మరణం చెందింది. ఆమె మరణం మోహన్ బాబుని తీవ్రంగా కుంగదీసింది. బాధ నుండి తెరుకున్న మోహన్ బాబు పిల్లల కోసం విద్యావతి చెల్లెలు అయిత నిర్మాల దేవిని పెళ్లీ చేసుకోగా, వీరికి మనోజ్ జన్మించాడు.
అయితే మోహన్ బాబు మొదటి భార్య సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు కథలు కథలుగా చెప్పుకుంటారు. అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి కాపురంలో అనుకోకుండా కలతలు మొదలు కావడం, మోహన్ బాబు నటించిన సినిమాలు వరుస ఫ్లాపులు కావడం, ఆయన మరో యువతితో ఏదో సంబంధం పెట్టుకున్నట్టు వార్తలు రావడం విద్యావతిని తీవ్రంగా కలిచివేసిందట. దీంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఆమె చనిపోయిన తర్వాత పిల్లలకు తల్లి లేని లోటు తీర్చాలని దాసరి నారాయణ రావు లాంటి పెద్దలు జోక్యం చేసుకొని విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు. ఒకప్పుడు మోహన్ బాబు చాలా కోపిష్టి కాగా, నిర్మలా దేవితో పెళ్లి అయ్యాక ఆ కోపం క్రమంగా తగ్గింది.