అక్కినేని నాగార్జున గురించి ఎవ్వరికీ పరిచయం అవసరం లేదు. నట సామ్రాట్ గా ఇప్పటికీ ఎన్నో హిట్స్ కొట్టిన ఈ అక్కినేని హీరోతో అమల ప్రయాణం సినిమాల ద్వారానే జరగడం విశేషం. అమల హాఫ్ ఇండియన్. హాఫ్ ఐరిష్. వాళ్ళ నాన్న ముఖర్జీ అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనది బెంగాల్ అని. ఐర్లాండ్ కి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనకి కోల్ కతాలో ఉన్నప్పుడు అమల పుట్టింది. ఆయన వృత్తి రీత్యా సౌత్ కి వచ్చేశారు. అలా పూర్తిగా ఇండియాలోనే పెరుగుతూ ఉన్న అమల సినిమాలకి అట్రాక్ట్ అయింది. మెల్లగా తన అందంతో, అభినయంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టింది. ముందుగా తమిళ్ లో ట్రై చేసింది. ఆ తర్వాత మాత్రమే అమల తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
తెలుగులో మొదటిసారిగా ‘కిరాయిదాదా’ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత చినబాబు, రక్తతిలకం, శివ, ప్రేమ యుద్ధం, రాజా విక్రమార్క, అగ్గిరాముడు, నిర్ణయం, ఆగ్రహం వంటి సినిమాలలో నటించింది. అమల ఒక స్టార్ హీరోయిన్. సౌత్ లో అన్ని భాషల్లోనూ నటించింది. మొత్తంగా 54 సినిమాల్లో నటించిన అమల నిర్ణయం సినిమాతో నాగార్జునతో ఆగిపోయింది.
ఐతే, శివ సినిమా సమయంలోనే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్న తర్వాత చేసిన నిర్ణయం సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత అమలకి నాగ్ ప్రపోజ్ చేసాడట. తనపై ప్రేమను వ్యక్తం చేయటంతో కాదనలేకపోయిన అమల వెంటనే ఓకే చెప్పినట్టు చెప్తారు. అప్పటికే నాగార్జునకి పెళ్లి అయిపోయినా కూడా, నాగచైతన్య కొడుగ్గా ఉన్నా కూడా వెళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద వార్త అయినప్పటికీ కొంతకాలం తర్వాత పరిస్థితులు మెల్లగా సర్దుకున్నట్లు తెలుస్తుంది. సో, ఏది ఏమైనా అమలని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసింది ముందుగా నాగార్జునే అన్నమాట.
Leave a comment