2023 లో ఏ హీరోయిన్ కు బాగా కలిసి వచ్చిందంటే..! - Filmylooks
Home Film News 2023 లో ఏ హీరోయిన్ కు బాగా కలిసి వచ్చిందంటే..!
Film News

2023 లో ఏ హీరోయిన్ కు బాగా కలిసి వచ్చిందంటే..!

2023 ముగింపు దసకు వచ్చింది.. ఈ సంవత్సరం టాలీవుడ్ లో ఏ హీరోయిన్‌ బాగా పాపులర్ అయింది..? ఏ హీరోయిన్ సక్సెస్ అందుకుంది.. ఏ హీరోయిన్ కు సక్సెస్ దక్కలేదు అనేది చూస్తే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు వార్త‌ల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండే రష్మిక 2023లో తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే ఈమె బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులర్ అయింది. ఇక ఈ సినిమా ఈమె కెరీర్ కు మంచి ప్లస్ అయింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్ ఈ ఏడాది మెరిసింది.

5 Times 'Vaathi' Actress Samyuktha Menon Gave Traditional Goals In Sarees

ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు బంపర్ హిట్‌లను అందుకుంది. తాజాగా నాని హాయ్ నాన్న సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ స‌లార్‌ తో మరో బిగ్గెస్ట్ హిట్ ను అందుకోబోతుంది. ఇలా ఈ ఏడాది శృతిహాసన్ మోస్ట్ లక్కీ హీరోయిన్గా నిలిచింది. ఈమె తర్వాత ఈ స్థాయిలో వరస విజయాలు అందుకున్న హీరోయిన్ సంయుక్తా మీన‌న్‌… సార్, విరూపాక్ష సినిమాలతో వరస విజయాలను అందుకున్న ఈమే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ ఎడాది ఈమె హ్యాట్రిక్ విజ‌యం అందుకున్నట్టే.

చాలా గ్యాప్ తీసుకుని వచ్చి 2023లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది అనుష్క. మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయం అందుకుంది. అటు మరో స్టార్ హీరోయిన్ సమంత కూడా శాకుంతలం లాంటి డిజాస్టర్ తర్వాత ఖుషి సినిమాతో ఓకే అనిపించుకుంది. అలాగే హాయ్ నాన్న సినిమాతో మృణాల్‌, బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య, సామజవరగమన సినిమాతో రెబా మౌనిక జాన్, దసరాతో కీర్తి సురేష్, భగవంత్‌ కేసరితో శ్రీలీల మంచి విజయాలు అందుకున్నారు.

Shruti Haasan: విలక్షణ విజయ నాయిక… శ్రుతి హాసన్! - NTV Telugu

అయితే ఇక్కడ శ్రీ లీలకు ఈ సంవత్సరం ఒక సినిమా హిట్ వ‌చ్చి.. స్కంద, ఆది కేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి మూడు సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అలాగే చిరు భోళా శంకర్ తో కీర్తి సురేష్, తమన్నా కూడా ఈ సంవత్సరం ప్లాఫ్లు అందుకున్నారు. కృతి శెట్టి కూడా ఈ సంవత్సరం కస్టడీ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయింది. అలాగే చాలామంది హీరోయిన్లు ఈ సంవత్సరం ఒక్కటంటే ఒక్క విజయం కూడా అందుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం శృతిహాసన్ మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలవగా.. ఈమె తర్వాత సంయుక్తమీన‌న్‌ కూడా పరవాలేదు అనిపించుకుంది

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...