Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి విడత సక్సెస్ ఫుల్‌గా సాగింది. దీంతో నిన్నటి నుండి మలి విడత చేపట్టారు. ఏలూరులో పవన్ కళ్యాన్ వారాహి యాత్ర సాగగా, ఆయనకు జనసైనికులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇక సభలో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తోంది అని పవన్ అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని తెలుస్తుండగా, వారిలో 12 నుంచి 14 వేల మందిని కాపాడామని పోలీసులు చెబుతున్నారు. మిరి మిగిలిన వారి సంగతి ఏమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అయితే మహిళల అదృశ్యంపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి,డీజీపీ ఒక్క సమీక్ష చేయలేదని, ముఖ్యమంత్రి ఇంట్లో ఆడపడుచులు మిస్ అయితే ఇలానే స్పందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఇలా మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారం అని, ఇలా రహస్యంగా సేకరిస్తున్న సమాచారం అసాంఘిక వర్గాలకు చేరుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయని పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
తన ఆరోపణలకు ఆధారాలు చూపకుండా కేంద్ర నిఘా వర్గాలను ఉటంకిస్తూ… రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళలు అపహరించారనే ఆరోపణ చేయడం ద్వారా ప్రజల్లో అలజడి రేపడమో, ప్రత్యర్థులు ఆవేశంగా స్పందించేలా రెచ్చగొట్టడమో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం పని చేసే వైసీపీ వాలంటీర్లని పవన్ కళ్యాణ్ అమ్మాయిల బ్రోకర్లు అన్నాడు. అంత నీచాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్ల కి సిగ్గు , శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే వాళ్లు పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ..పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి మొహాలెలా చూపెట్టగలరు అంటూ ఘాటుగా స్పందించారు వర్మ.