Pawan: చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్‌కి అభిమానులు కాదు భక్తులు ఉంటారు.ఆయన సినిమాలపై కన్నా సామాజిక సేవపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వెళ్లారు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే ఆయన శిక్షణ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కోసం పవన్ చాలా కష్టపడ్డడు. తమిళనాడులో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు కావలసిన వ్యక్తి దగ్గరే నేర్చుకోవాలని అనుకున్నాడట.
అందుకోసం చాలా రోజుల పాటు ట్రైనర్ చుట్టే తిరిగాడట. అందుకు కారణం ఆ ట్రైనర్ అప్పటికే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నేర్చుకుంటే అతని దగ్గరే నేర్చుకోవాలని పవన్ అనుకున్నాడట. అయితే తాను ఎంత చెప్పిన పవన్ వినకపోయే సరికి కొన్ని కండీషన్స్ పెట్టాడట. ఉదయం 5 గంటలకే ఇంటికి రావాలని అలాగే రాత్రి 11 వరకు తనతోనే ఉండాలని, ఇక తనకు ఖాళీ ఉన్న సమయంలో ఓ అరగంట మాత్రమే నేర్పిస్తానని అన్నాడట. దానికి ఓకే చెప్పిన పవన్.. రోజు తెల్లవారుఝామున వెళ్లి ట్రైనర్ ఇంటి మందు నిలుచునేవాడట.
ఇక ట్రైనర్‌కి టీ పెట్టి ఇవ్వడం, కరాటే నేర్చుకునే ప్రదేశాన్ని తానే శుభ్రపరచుకోవడం వంటి పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేసేవాడట. అయితే ముందు తాను చిరు తమ్ముడు అని తెలియదట. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో సీరియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడట.అలా ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు . అయితే కళ్యాణ్ కుమార్ అని అతని పేరు ఉండగా, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ పెట్టాడట.ఈ విషయాన్ని సదరు ట్రైనర్ ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు.