Rashmi: బుల్లితెర కామెడీ షోలు జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు ప్రేక్షకులకి మంచి మజాని అందిస్తున్నాయి. ఒకవైపు యాంకర్స్ గ్లామర్ షో, మరోవైపు కమెడీయన్స్ పవర్ ఫుల్ కామెడీ ప్రేక్షకులకి మంచి మజాని అందిస్తుంది. ముఖ్యంగా ఈ షోలలో ఆది తర్వాత ఆ రేంజ్లో తనదైన పంచ్‌లు వేసి నవ్విస్తున్నాడు రామ్ ప్రసాద్. కాకపోతే కొన్నిసార్లు ఆయన కామెడీ బరస్ట్ అవుతుంది. బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్న నేపథ్యంలో నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఒకప్పుడు సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నారు. ఫ్యామిలిలో చూసే కార్యక్రమాల్లో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు పెడితే ఎలా అని పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రీసెంట్గా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్ రష్మీపై రామ్ ప్రసాద్ చేసిన వల్గర్ కామెంట్ పై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్.. రష్మిని రాత్రికి వస్తావా అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ పేలుస్తాడు.. అప్పుడు రష్మీ… అసలు నేనెందుకు రాత్రికి రావాలి అడుగుతుంది. అప్పుడు రాంప్రసాద్ కాస్త వెరైట ఎక్స్ప్రెషన్ ఇస్తూ.. నైట్ కి ఎందుకు పిలుస్తారో తెలియదా నీకు ? అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఇంద్రజ ఏయ్ అని గట్టిగా అరవడంతో .. మేడం మా ఊర్లో రాత్రికి జాతర ఉంది.. ఆ జాతరకే పిలుస్తున్నానంటూ కవర్ చేసుకున్నాడు.
ఆయన ఎంత కవర్ చేసుకున్నా కూడా ఈ విషయంపై అందరికి క్లారిటీ ఉండడంతో రామ్ ప్రసాద్‌ని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఇక నువ్వు మారవా, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బంది పెడుతూనే ఉంటావా..ఎన్నాళ్లు మీరు ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నెట్టుకొస్తారు అంటూ నెటిజన్స్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా విష్ణు ప్రియ శరీరంపై, ముక్కుపై రాంప్రసాద్ చేసిన డబుల్ మీనింగ్ డైలాగులు చాలా వివాదాస్పదం అయ్యాయి. అయినప్పటికీ రాం ప్రసాద్ అదే పంథా కొనసాగిస్తూ నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. అయినప్పటికీ మనోడి పంథా మారడం లేదు.