తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పకున్నా తక్కువే సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదిగి ఎందరో హీరోలకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. అలాంటి చిరంజీవి ఆయన కెరీర్ లో ఒక దర్శకుడు తో చేసిన రెండు సినిమాలు మాత్రం పెద్దగా ఆడకపోవడం అనేది ఇప్పటికీ ఆయనకు ఒక తీరని లోటుగా మిగిలిపోయింది అనే చెప్పాలి.
ఇంతకీ ఆ సినిమాలు ఆ దర్శకుడు ఎవరుంటే.. కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు ఈ రెండు సినిమాలు కూడా విమర్శకులు దగ్గర నుంచి మంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే అప్పటికే చిరంజీవి మాస్ హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి సమయంలో ఇవి చాలా క్లాసికల్ సినిమాలు వీటిని చూసి చిరంజీవి అభిమానులు జీవించుకోలేకపోయారు. చిరంజీవి సినిమా అంటే స్క్రీన్ మీద ఫైట్లు, మాస్ స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోయేది.
అలాంటివేవీ ఈ సినిమాల్లో ఉండవు. కాబట్టి ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆస్తి చూపించలేదు.. అందువల్లే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదని అంటారు. ఇక ప్రస్తుతం చిరంజీవి బింబిసార తో మంచి విజయం అందుకున్న వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్లో కూడా సీనియర్ హీరోయిన్ త్రిష కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.