Kaikala: యముడు.. చూడటానికి గంభీరంగా.. హుందాగా.. చాలా ఠీవీగా ఉండాలి. భారీ శరీరంతో ఎవరైనా చూస్తే భయపడేలా ఉండాలి. మరణానికి దగ్గరగా వెళ్తేనే యముడిని చూడగలం. కానీ మన సినిమా ఇండస్ట్రీలో నిజంగా యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా ఎంతోమంది నటులు నటించారు. వారందరిలోనూ యముడి పాత్రకు ధీటుగా సరిపోయే నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన మాత్రమే యముడి పాత్రలు వేయగలరేమో అనిపించేలా నటించారు. తెలుగు ప్రేక్షకులకు యముడ్ని పరిచయం చేశారు. ఆయన నటనతో ఎంతోమందిని మెప్పించారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో సినిమాల్లో యముడి పాత్రలు పోషించారు. తన సినిమా కెరీర్ లోనే అత్యంత హుందాగా పాత్రల్ని పోషించారు.
మరి అలాంటి కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ అనే సినిమాలో ఎందుకు నటించలేదు అనేది సందేహం అప్పట్లో చాలామందిలో వచ్చింది. నిజానికి కైకాల సత్యనారాయణ యముడి పాత్రలే కాకుండా.. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో, కమెడియన్ గా, తండ్రిగా, తాత పాత్రల్లోనూ నటించి మెప్పించారు. తన అరవై ఏళ్ల సినీ కెరీర్ లో 700 లకు పైగా సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో చాలా మూవీస్ లో కైకాల సత్యనారాయణ యముడి పాత్రల్ని పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాలో మాత్రం కైకాల యముడిగా నటించలేదు. ఈ విషయంలో ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో కైకాల సత్యనారాయణ ఓసారి దీని గురించే మాట్లాడారు.
ఫస్ట్ టైమ్ యమగోల సినిమాలో తాను యముడిగా అవకాశం వచ్చిందని.. ఆ సినిమాలో యముడిగా తాను, సీనియర్ ఎన్టీఆర్ తాను పోటీ పడ్డామని అన్నారు. అలా జూనియర్ ఎన్టీఆర్ సినిమా యమదొంగ మూవీలో కూడా తనను యముడిగా అడిగితే.. రెమ్యునరేషన్ విషయంలో కాస్త అటు ఇటు అవ్వడం వల్ల ఆ సినిమాలో నటించనని చెప్పుకొచ్చినట్లు వివరించారు. దాంతో సినిమా టీమ్ మోహన్ బాబు అప్రొచ్ అవ్వడంతో ఆయన యముడిగా పాత్ర పోషించారు. ఈ సినిమాతో యముడి పాత్రలు చేయడంలో మోహన్ బాబు తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో యముడిగా మోహన్ బాబుకు మంచి గుర్తింపు వచ్చింది.