Bikini Look: ఈ రోజుల్లో హీరోయిన్స్, యాంకర్స్ , స్టార్ హీరోల భార్యలు బికినీలలో కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు పద్దతిగా చీరకట్టులో కనిపించే వారు నెటిజన్స్ అటెన్షన్ కోసం గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారు. ఒక్కోసారి బికినీలలో వారు చేసే రచ్చకి సోషల్ మీడియా షేక్ అయిపోతుంటుంది. తాజాగా మాజీ హీరోయిన్, హీరో భార్య, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన వితికా షెరు బికినీలో కనిపించి పెద్ద షాకే ఇచ్చింది. ఇన్నాళ్లు పద్దతిగా ఉన్న ఈ అమ్మడు ఇలా బికినీలో కనిపించే సరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఉండే వితికా ఎలా అయిపోయిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వితికా షెరు.. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య అనే విషయం తెలిసిందే. వరుణ్ సందేశ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హ్యాపీ డేస్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సైలెంట్ అయ్యాడు. తన భార్య వితికా షెరుతో కలిసి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి కూల్ సైలెంట్ క్యారెక్టర్ అంటూ ముద్ర వేయించుకున్నాడు. వితికాని వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు. వితికాకి వరుణ్ పెద్దగా కండీషన్స్ ఏమి పెట్టడు. దీంతో ఒక్కోసారి ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటుంది.
రీసెంట్‌గా వెకేషన్ వెళ్లిన వితికా వాటర్ ఫాల్స్ దగ్గర టూ పీస్ బికినీతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన అభిమానులు వితికాని తిట్టిపోస్తున్నారు. ఈ పిక్స్ చూశాక నీపై ఉండే గౌరవం తగ్గిపోతుంది. చెడు స్నేహాల వలన ఇలా మారిపోతున్నావు అని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో వితికా స్పందిస్తూ.. బట్టల వల్ల మనుషులపై అభిప్రాయాలు మారిపోయే సొసైటీలో మనం ఉన్నామా.. స్విమ్మింగ్ చీరకట్టుకుని చేయలేము కదా.. స్విమ్మింగ్ కి వెళ్ళినప్పుడు అలాంటి కాస్ట్యూమ్స్ ధరించాలి. సందర్భాన్ని బట్టి కంఫర్ట్ ని బట్టి బట్టలు వేసుకోవడం లో తప్పులేదు అంటూ తన తప్పుని కవరింగ్ చేసుకొనే ప్రయత్నం చేసింది వితికా. ఏది ఏమైన కూడా ఇప్పుడు వితికా టు పీస్ బికినీ ఫొటోస్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.