Vaarasudu: ఇళయ దళపతి విజయ్ కోలీవుడ్‌లో బిగ్ స్టార్.. మిగతా చోట్ల కూడా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ విజయ్ యాక్ట్ చేసిన కొన్ని సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కోలీవుడ్‌కే పరిమితమైన విజయ్‌ని నిర్మాత దిల్ రాజు టాలీవుడ్‌లో లాంచ్ చేస్తున్నాడు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రష్మిక కథానాయికగా నటిస్తున్న విజయ్ 66వ సినిమాకి తమిళ్‌లో ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్ ఫిక్స్ చేస్తూ.. విజయ్ పుట్టినరోజు స్పెషల్‌గా ముందు రోజు సాయంత్రం ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేశారు. తర్వాత రోజు మరో రెండు పోస్టర్లు కూడా వదిలారు.
అయితే పోస్టర్ల మీద తమిళ్ టైటిల్ మాత్రమే ఉంది. ‘వారసు’ అనే పేరుని ఇంగ్లీష్‌లో రాశారు కానీ మూడు పోస్టర్లలో ఏ ఒక్కదాని మీద కూడా ‘వారసుడు’ అని రాయలేదు. విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా తమిళ పోస్టర్లే. గతంలో విజయ్ ఇది తమిళ్ మూవీ అని చెప్పాడు కానీ మేకర్స్ మాత్రం బైలింగ్వుల్ (తెలుగు-తమిళ్) అన్నారు.
ఆ లెక్కన చూస్తే తెలుగు పోస్టర్ ఎందుకు విడుదల చెయ్యలేదు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలోనూ ఇంగ్లీష్ పదాలతో, టైటిల్స్‌తో, అక్షరాలతో కొన్ని సినిమాలొచ్చాయి. వాటిలో కొన్నిటిని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తమిళ్ విషయానికొస్తే.. ఎవరి సినిమా అయినా కానీ తమ మాతృభాషలోనే టైటిల్ పెట్టాలనే నిబంధన కోలీవుడ్‌లో ఉంది.
మరి తమిళ స్టార్‌ని తెలుగుకి తీసుకొచ్చి కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ ముట్టచెప్తూ తెలుగు పోస్టర్ రిలీజ్ చెయ్యడానికేమైంది? దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతకి పోస్టర్ మీద తెలుగులో పేరు రాసేవాళ్లే దొరకలేదా?, తెలుగు టైటిల్ ఉంటే విజయ్ గురించి తెలియని వాళ్లకి తెలుస్తుంది.. సినిమా రీచ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Leave a comment