సినిమాకి సంగీతానికి విడదీయరాని సంబంధం ఉంది. ముఖ్యంగా మన భారతీయ సినిమాలో. అలాంటి సంగీతానికి కూడా ఒక డే ఉంది. అది ఈ రోజే. జూన్ 21. మొదటి సారిగా ఫ్రాన్స్ లో 1982 లో ఈ రోజుని ప్రత్యేకంగా మ్యూజిక్ కోసం సెలబ్రేట్ చేసుకోవటం మొదలుపెట్టారు. ‘Fete de la Musique’ పేరుతో ఫ్రాన్స్ లో ప్రతీ ఏటా ఒక భారీ ఈవెంట్ జరుగుతుంది. ఇదెంతో ఫేమస్. ఈ రోజున ఇక్కడికి అనేక దేశాల నుండి సంగీత అభిమానులు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయినా, కరోనా ఇంకా కొన్ని దేశాలలో అధికంగా ప్రభావం చూపిస్తుండటంతో ఈ సారికి ఈ ఈవెంట్ పైన ఆంక్షలు విధించారు.
ఐతే, ఈ సందర్భంగా ప్రముఖులు సంగీతంపై తమ ఇష్టాన్ని తమ అభిమానులతో పంచుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ‘My life in a single frame’ అంటూ తన స్థూడియో పిక్చర్ ని ట్విటర్ లో షేర్ చేసుకున్నాడు. ప్రపంచంలోని మ్యుజీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంకా MTV వంటి మ్యూజిక్ ప్లాట్ఫామ్స్, FM సంస్థలు మ్యూజిక్ గురించి మాట్లాడటానికి, సంగీత అభిమానులకి వాళ్ళ ఫెవరేట్ మ్యూజిక్ ని వినిపిస్తూ ఈ రోజుని సెలబ్రేట్ చేస్తున్నాయి.
Leave a comment