Pawan Kalyan-Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తప్పక ఉంటారు. ఎవరి స్టైల్లో వారు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మహేష్ బాబు త్వరలో రాజమౌళితో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ పీక్స్‌కి వెళ్లడం ఖాయం. అయితే ఈ ఇద్దరికి టాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలానే వీరికి కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడం ఖాయం. వీరిద్దరి కామన్ పాయింట్స్‌ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ సందర్భంలో తెలియజేయగా, అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లలో సింప్లిసిటీ అనే కామన్ పాయింట్ ఉందని వెల్లడించాడు త్రివిక్రమ్. ఓ సందర్భంలో మాట్లాడుతూ…“అతడు (2005) సినిమా చిత్రీకరణ జరిగేటప్పుడు మహేష్ వార్డ్‌రోబ్‌లో రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్ మాత్రమే ఉండేవి.షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా వాళ్లు ఇచ్చిన కాస్ట్యూమ్స్ ధరించి షూటింగ్ పూర్తయ్యాక వాటిని ఇచ్చేసి కారులో వెళ్లిపోతాడు. అతను ఎంత చిన్న కారైన సరే అందులో వెళ్లిపోతారు..ఖరీదైన బట్టలు, ఖరీదైన కారు కావాలని ఏనాడు అతను అనడు. అలానే తను ఉంటున్న ఇల్లు పెద్దదా చిన్నదా అనేది చూడడు.ఉండడానికి ఒక రూమ్ ఉంటే మహేష్ కి చాలు.చూసుకోవడానికి సినిమాలు, చదువుకోడానికి బుక్స్ ఉంటే అదే ఆయనకి పదివేలు అని త్రివిక్రమ్ అన్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ. .. పవన్ కళ్యాణ్ కూడా రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్ ఉంటే సరిపెట్టుకుంటాడు.అతనికి చదువుకోడానికి నాలుగు బుక్స్ ఉంటే ఫుల్ టైంపాస్ అవుతుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడతారు అని త్రివిక్రమ్ అన్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం వారిద్దరి స్పెషాలిటి అని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్‌తో కలిసి గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.