NTR: సీనియర్ ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా సంచలనాలను సృష్టించారు. కోట్ల సంఖ్యలో అభిమానులకు ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ మరణం వేలాది మంది అభిమానులను బాధ పెట్టింది. సీనియర్ ఎన్టీఆర్ జీవించి ఉంటే ప్రజలకు సుపరిపాలన అంది ఉండేదని ఎంతోమంది అభిప్రాయం కూడా. అలాగే సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని చాలామంది భావిస్తారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నో కథనాలను సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ గారు స్థితప్రజ్ఞుడు అని ఇమంది రామారావు అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య భర్తను కూడా ఆయన్ను చంటిపిల్లాడిలా చూసుకునేవారని అన్నారు.
ఎన్నో సినిమాల్లో నటించేటప్పుడు, సమాజసేవ కోసం బయటకువెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారట. రామారావు గారికి తెలుగంటే ఎంతో అభిమానమని ఎన్నో పద్యాలు ఆయనకు వచ్చని అన్నారు. ఎంతో భారీ డైలాగ్స్ ని కూడా అవలీలగా చెప్పగలరని అన్నారు. ఇక లక్ష్మీ పార్వతి బాధలు విని ఎన్టీఆర్ మనస్సు కరిగిందని అందుకే తనకు కూడా ఈ వయస్సులో ఒక తోడు కావాలని అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నారని చెప్పారు. లక్ష్మీ పార్వతి తన ప్రవర్తనతో తనలాంటి మహిళ జీవితంలో ఉంటే ఎన్టీఆర్ కు మంచి జరుగుతుందనుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ మొండి మనిషి అని.. తాను ఏది అనుకుంటే అది జరిగేలా చూసుకుంటారని అన్నారు. ఇక సైకాలజికల్ గా కూడా కనెక్ట్ అయ్యి ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారని ఇమంది రామారావు అన్నారు.
ఇక ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన ముందు నోరెత్తరని అన్నారు. ముఖ్యంగా ఈమంది రామారావు చెప్పిన కామెంట్స్ ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ బాబాయి త్రివిక్రమరావు ఆరోగ్యంగా ఉండి ఉంటే లక్ష్మీ పార్వతి ఆటలు సాగేది కాదని అన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్, హీరోయిన్ కృష్ణకుమారిలు పెళ్లి చేసుకుందామని అనుకున్నారట. ఈ విషయం తెలిసి త్రివిక్రమరావు, కృష్ణకుమారి ఇంటికి వెళ్లి మరీ గన్ తో బెదిరించారట. దాంతో ఆమె బెంగుళూరుకు వెళ్లిపోయిందని అప్పట్లో వార్తలు కూడా ఎక్కువగా వైరల్ అయ్యాయి.