ఆ అమ్మాయి చిన్న వయసులోనే తనకి సంగీతంలో మంచి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది. కేవలం మగవాళ్లే సంగీత దర్శకులుగా రాణిస్తున్న తరుణంలో ఆ అమ్మాయి ఒక్కగానొక్క మహిళా దర్శకురాలుగా నిలబడింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇంతటి ప్రత్యేకమైన ఆ అమ్మాయి ఎవరు. ఇప్పుడేం చేస్తుంది..
ఆ అమ్మాయి పేరే మణిమేకల శ్రీలేఖ. కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లాలో మాన్వి అనే ప్రాంతంలో పుట్టినప్పటికీ తను పూర్తిగా తెలుగమ్మాయి. గొప్ప దర్శకుడైన రాజమౌళి, సంగీత దర్శకుడైన కీరవాణికి ఆమె కుటుంబ సభ్యురాలు. కానీ తన టాలెంట్ తో చిన్న వయసులోనే అందరిముందూ నిరూపించుకుంది. చిన్న వయసు అంటే కేవలం 12 సంవత్సరాల వయసులో. అది కూడా మాతృభాష కాని తమిళంలో.
అవును. అంత చిన్న వయసులోనే తనెంతో ప్రత్యేకమని నిరూపించుకుంది శ్రీలేఖ. విజయ్ హీరోగా చేసిన ‘Naalaiya Theerpu’ సినిమాకి ఆ వయసులోనే మ్యూజిక్ ఇచ్చారు. కానీ అక్కడ ఈ సినిమాకి వేరే పేరుతో పరిచయం అయింది శ్రీలేఖ. అదే ‘మణిమెగలై’. 1992 లో వచ్చింది ఈ సినిమా. ఈ మధ్య విజయ్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేసింది శ్రీలేఖ.
ఆమె స్వయంగా సింగర్ కూడా. తెలుగులో చాలా పాటలు పాడారు కూడా. ఆమె కంపోజ్ చేసిన మొదటి మూవీ ‘తాజ్ మహల్’. కన్నడ, మలయాళం, హిందీ సినిమాలకి కూడా మ్యూజిక్ ని కంపోజ్ చేసారు. తెలుగులో – కొండపల్లి రత్తయ్య, ఓహో నా పెళ్ళంట, ధర్మచక్రం, నవ్వులాటం శివయ్య, మూడు ముక్కలాట, ప్రేమించు, అమ్మాయి బాగుంది, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, ఆపరేషన్ దుర్యోదన, లైలా మజ్ను, మహాలక్ష్మి, మైసమ్మ ఐపిఎస్, మా ఆయన చంటి పిల్లాడు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మంగతాయారు టిఫిన్ సెంటర్, ఆఆఇఈ, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వంటి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చారు. చివరగా తెలుగులో ‘శ్రీవల్లి’ అనే సినిమా చేసారు. ఈ సంవత్సరంలో ‘రాధా కృష్ట’ షెడ్యూల్ లో ఉంది.
Leave a comment