ఇండియాలో ప్రత్యేకంగా ఒక మ్యూజిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సింగర్ కం మ్యుజీషియన్ యోయో హనీసింగ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటిదాకా తన పాటలతో దేశ యువతని ఉర్రూతలూగించిన ఈ సెలబ్రిటీ తన భార్య విషయంలో ఊగిపోయాడు. ఆమెని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని ఆమె కోర్టుని ఆశ్రయించింది. హనీసింగ్ అసలు పేరు హర్దీశ్ సింగ్. స్టేజ్ నేమ్ హనీసింగ్ తో పాపులారిటీని సంపాదించాడు.
ఐతే, తనని వేధిస్తున్నాడని.. తనని రక్షించాల్సింది పోయి ఇష్టమొచ్చినట్టు తిట్టడం, కొట్టడం వంటివి చేస్తున్నాడని తనకి చేసిన డ్యామేజ్ కి గానూ 20 కోట్లు ఇప్పించాలని.. అలాగే నెలకు 5 లక్షల చొప్పున పంపాలని, పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి కట్నం కింద ఇచ్చిన ఆస్తులని కూడా తిరిగి ఇప్పించాలని కోర్టుని వేడుకుంది. హనీసింగ్ ఇంట్లో ఒకలా, బయట ఒకలా ఉంటాడని చెప్పుకొచ్చింది. తనకి కోవిడ్ వచ్చి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని భర్త సహాయం కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం కరోనాకి సంబంధించి సందేశాలు ఇస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.
ఒక సంధర్భంలో తనని దాదాపు రెండు రోజులు రూమ్ లో బంధించి ఫుడ్ కూడా ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక తనపై జరుగుతున్న హింసని ఏ ఓర్చుకోలేను అనుకుని ఇలా కోర్టుని ఆశ్రయించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక మంచి సింగర్ గా పాపులర్ ఐన హనీసింగ్ మనిషిగా ఇంత క్రూరంగా బ్రతికేస్తున్నాడా అని షాక్ అవుతున్నారు అతని ఫాన్స్. ఈ విషయానికి సంబంధించి ఆగస్ట్ 28 లోగా స్పందించాల్సిందిగా అతనికి ఉత్తర్వులు జారీ చేసింది కోర్ట్. ఈ విషయం మీద హనీసింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Leave a comment